Fire Boltt: ఫైర్ బోల్ట్ నుంచి ఒకేసారి మూడు స్మార్ట్ వాచీలు

Fire Boltt launches 3 new smartwatches in India all priced under Rs 4000
  • శాటర్న్, టాక్ 3, నింజా ఫిట్ పేరుతో విడుదల
  • దేశవ్యాప్తంగా అన్ని ఆఫ్ లైన్ స్టోర్లలో లభ్యం
  • వీటి ధరలు రూ.1,299 నుంచి ప్రారంభం
దేశీ వేరబుల్ ఉత్పత్తుల కంపెనీ ఫైర్ బోల్ట్.. ఒకేసారి మూడు స్మార్ట్ వాచీలను విడుదల చేసింది. వీటి ధరలు రూ.4,000 లోపు ఉన్నాయి. శాటర్న్, టాక్-3, నింజా ఫిట్ పేరుతో వీటిని తీసుకొచ్చింది. ప్రధానంగా ఆఫ్ లైన్ స్టోర్లలో విక్రయాల కోసం ఈ ఉత్పత్తులను విడుదల చేసినట్టు కంపెనీ తెలిపింది. ఇందులో శాటర్న్ ధర రూ.3,999. టాక్-3 ధర రూ.2,199. నింజా ఫిట్ ధర రూ.1,299. క్రోమా, రిలయన్స్, విజయ్ సేల్స్, పూర్విక, సంగీత సహా దేశవ్యాప్తంగా 750 పట్టణాల్లోని దుకాణాల్లో లభిస్తాయని ఫైర్ బోల్ట్ ప్రకటించింది.

ఫైర్ బోల్ట్ శాటర్న్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచీ 1.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే తో ఉంటుంది. స్క్రీన్ పెద్దగా ఉండడం సౌకర్యాన్నిస్తుంది. స్మార్ట్ వాచ్ లోనే మైక్, స్పీకర్ ఉన్నందున మ్యూజిక్ వినడానికి, కాల్స్ చేసుకోవడానికి అనుకూలం. 110 స్పోర్ట్స్ మోడ్ లు ఉన్నాయి. ఐపీ 67 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ తో వస్తుంది. కెమెరా, మ్యూజిక్ కంట్రోల్ ను స్మార్ట్ వాచీ నుంచే చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ చూసుకోవచ్చు.

ఫైర్ బోల్ట్ టాక్-3 స్మార్ట్ వాచ్ సైతం బ్లూటూత్ కాలింగ్ సదుపాయంతో వస్తుంది. ఇందులో డిస్ ప్లే కొంచెం చిన్నగా 1.28 అంగుళాల సైజుతో, హెచ్ డీ టచ్ డిస్ ప్లేగా వస్తుంది. డయల్ వృత్తాకారంలో ఉంటుంది. యూజర్లు తమకు నచ్చిన విధంగా స్మార్ట్ వాచ్ ఫేస్ మార్చుకోవచ్చు. 123 స్పోర్ట్స్ మోడ్ లు ఉన్నాయి. ఐపీ 67 వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ తో వస్తుంది. ఫిట్ నెస్ ట్రాకర్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.  

ఫైర్ నింజా స్మార్ట్ వాచ్ 1.69 అంగుళాల హెచ్ డీ టచ్ డిస్ ప్లేతో ఉంటుంది. 123 స్పోర్ట్స్ మోడ్ లు ఉంటాయి. ఐపీ 68 వాటర్ రెస్టిస్టెన్స్ ఫీచర్, ఒకటికి మించిన వాచ్ ఫేస్ లు ఉన్నాయి. ఎస్పీవో2, హార్ట్ రేట్, నిద్రను మానిటర్ చేసే సదుపాయాలు ఉన్నట్టు కంపెనీ తెలిపింది.
Fire Boltt
launches
smart watches
saturn
ninja fit
talk 3

More Telugu News