ఇది పిచ్చికాదు .. ప్రేమ: 'బుట్టబొమ్మ' ట్రైలర్ రిలీజ్!

  • 'బుట్టబొమ్మ'గా అనిఖ సురేంద్రన్ 
  • పల్లెటూరి ప్రేమకథ ప్రధాన నేపథ్యం
  • ప్రతినాయకుడిగా అర్జున్ దాస్ 
  • సంగీతాన్ని సమకూర్చిన గోపీసుందర్ 
  • వచ్చేనెల 4వ తేదీన సినిమా విడుదల
Buttabomma trailer released

బాలనటిగా అనేక అవార్డులను అందుకున్న అనిఖ సురేంద్రన్, హీరోయిన్ గా తెలుగులో చేసిన మొదటి సినిమా 'బుట్టబొమ్మ'. ఇది ఒక పల్లెటూరిలో నడిచే స్వచ్ఛమైన ప్రేమకథ. సితార నాగవంశీ - సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి, శౌరీ దర్శకత్వం వహించాడు.

ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తూ వెళ్లాయి. కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. విష్వక్సేన్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. గ్రామీణస్థాయిలో ఉండే ప్రేమ ... పరువు .. భయం .. రాజకీయాలు అనే అంశాలను కవర్ చేస్తూ కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. 

సూర్య వశిష్ఠ - అనిఖ ప్రేమికులుగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా అర్జున్ దాస్ కనిపించనున్నాడు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్ ను ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి.

More Telugu News