Aero India 2023: ఎయిర్ షో సందర్భంగా యలహంక ప్రాంతంలో మాంసాహార విక్రయాలపై నిషేధం

  • ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు ఎయిర్ షో
  • మాంసాహార వ్యర్థాలకు పక్షులు ఆకర్షితులవుతాయన్న బీబీఎంపీ
  • వీటి వల్ల విమాన ప్రమాదాలు జరగకుండా నిర్ణయం
Aero India 2023 Non veg sale banned in 10 km radius of Bengaluru air force station

వాయు విన్యాసాలేంటి? మాంసహార విక్రయాల నిషేధం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే. బెంగళూరు శివారులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ‘ఏరో ఇండియా 2023’ (వాయుసేన విన్యాసాలు) కార్యక్రమం జరగనుంది. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు దీన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు అన్ని మాంసాహార విక్రయాలపై నిషేధం విధిస్తూ బృహత్ బెంగళూరు నగర పాలిక (బీబీఎంపీ) ఆదేశాలు జారీ చేసింది.

‘‘యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేడియం చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో మటన్, చికెన్ విక్రయాలు చేయకూడదు. అన్ని రెస్టారెంట్లు మీట్, చికెన్, చేపలతో చేసిన ఆహారాన్ని విక్రయించకూడదు’’ అని బీబీఎంపీ పేర్కొంది. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించింది. మాంసాహార వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తే అవి పక్షులు ముఖ్యంగా కైట్ తరహా పక్షులు వాటి కోసం వస్తాయని, వీటి కారణంగా విమాన ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీబీఎంపీ తెలిపింది.

More Telugu News