Nara Lokesh: లోకేశ్ పాదయాత్ర రెండో రోజు ప్రారంభం.. షెడ్యూల్ ఇదిగో

Nara Lokesh padayatra second day started
  • పేస్ మెడికల్ కాలేజీ నుంచి పాదయాత్ర ప్రారంభం
  • పాదయాత్రలో భారీగా పాల్గొంటున్న టీడీపీ శ్రేణులు
  • బెగ్గిలిపల్లి, కడపల్లె, కలమలదొడ్డి, శాంతిపురం గుండా పాదయాత్ర
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండో రోజు ప్రారంభమయింది. నిన్న తొలి రోజున పాదయాత్రకు అపూర్వమైన ప్రజాస్పందన వచ్చింది. ఈరోజు కూడా భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటలు పేస్ వైద్య కళాశాల నుంచి పాదయాత్ర మొదలయింది. బెగ్గిలిపల్లె, కడపల్లె, కలమలదొడ్డి గుండా పాదయాత్ర కొనసాగుతుంది. కలమలదొడ్డి వద్ద మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. భోజనాల అనంతరం పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం శాంతిపురం క్యాంపు వద్ద సైట్ ఇంటరాక్షన్ ఉంటుంది. తుమ్మిశి చెరురు సమీపంలో పలమనేరు - కుప్పం జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బస శిబిరంలో రాత్రికి బస చేస్తారు.  

Nara Lokesh
Yuva Galam
Padayatra
Telugudesam

More Telugu News