uber: నాకు నిద్ర వస్తోంది.. రైడ్ క్యాన్సిల్ చేసుకోండి.. కస్టమర్ కు ఉబెర్ డ్రైవర్ మెసేజ్

  • అర్ధరాత్రి క్యాబ్ బుక్ చేసుకున్న మహిళకు ఎదురైన అనుభవం
  • డ్రైవర్ నిజాయతీగా కారణం చెప్పడంతో సరేనన్న మహిళ
  • ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో సానుకూలంగా స్పందిస్తున్న నెటిజన్లు
Woman Shares Bengaluru Uber Drivers Reason For Cancelling Ride

రైలో, బస్సో అందుకోవాలనే తొందరలో మొబైల్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుంటాం.. చాలాసార్లు సమయానికే వచ్చి గమ్యం చేర్చే క్యాబ్ డ్రైవర్లు ఒక్కోసారి తెగ విసిగించేస్తారు. బుక్ అయినా క్యాబు కదలదు.. ఐదు, పది నిమిషాలు దాటినా కారు వస్తున్న సూచనలే కనిపించవు. ఇక ఉండబట్టలేక ఫోన్ చేస్తే.. సింపుల్ గా రైడ్ క్యాన్సల్ చేసుకోవాలని డ్రైవర్ ఉచిత సలహా ఇస్తే మనకు కోపం రాకమానదు. అయితే, బెంగళూరులో ఓ డ్రైవర్ ఇలాగే చేసినా తనకు ఏమాత్రం కోపం రాలేదని అంటున్నారో మహిళ. ఎందుకంటే ఆ డ్రైవర్ చెప్పిన కారణమేనని వివరించారు. ఇంతకీ ఆ డ్రైవర్ ఏం చెప్పాడంటే..

బెంగళూరులో ఆషి అనే మహిళ ఈ నెల 25న అర్ధరాత్రి 1 గంటకు ఉబెర్ యాప్ లో క్యాబ్ బుక్ చేశారు. తొలుత రైడ్ ను అంగీకరించిన ఉబెర్ డ్రైవర్, కాసేపటికి రైడ్ రద్దు చేసుకోవాలంటూ ఆమెకు మెసేజ్ పెట్టాడు. తనకు నిద్ర వస్తోందని చెబుతూ రైడ్ క్యాన్సిల్ చేసుకోవాలని కోరాడు. ఆ డ్రైవర్ నిజాయతీగా చెప్పడంతో తాను సరేనంటూ మెసేజ్ చేసి, ఆ రైడ్ ను రద్దు చేసుకున్నానని వివరించారు. ఆషి ఈ మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పెట్టారు. దీనిపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. డ్రైవర్ నిజాయతీని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

More Telugu News