Sara Tendulkar: షారుఖ్ సినిమా గురించి ఇన్స్టాలో పోస్ట్ చేసిన సారా టెండూల్కర్

Sara Tendulkar watches Shahrukh Pathaan movie
  • బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'పఠాన్'
  • ఆరేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారుఖ్ సినిమా
  • లండన్ లో స్నేహితులతో కలిసి సినిమా చూసిన సారా
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, అందాల భామ దీపికా పదుకొణే జంటగా నటించిన 'పఠాన్' సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆరేళ్ల తర్వాత షారుఖ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం దాదాపు రూ. 250 కోట్లను వసూలు చేసింది. గత కొంత కాలంగా సరైన హిట్ లేక చతికిల పడిన బాలీవుడ్ కు ఈ చిత్రం ఊపిరి పోసింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటోంది.

మరోవైపు ఈ సినిమాను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్ వీక్షించింది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టా ద్వారా  వెల్లడించింది. ప్రస్తుతం ఆమె అండన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. తన స్నేహితులతో కలిసి 'పఠాన్' సినిమాను చూస్తున్న చిత్రాన్ని ఆమె షేర్ చేసింది.  

ఇదిలావుంచితే, యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో సారా లవ్ లో ఉందనే వార్తలు గతంలో వినిపించాయి. అయితే ఆ బంధం ముగిసిపోయిందని... ప్రస్తుతం సినీ నటి సారా అలీఖాన్ తో శుభ్ మన్ గిల్ ప్రేమలో ఉన్నాడని చెపుతున్నారు.
Sara Tendulkar
Pathaan Movie
Shahrukh Khan
Bollywood

More Telugu News