రెండు రోజుల్లోనే రూ. 235 కోట్లతో ‘పఠాన్’ కలెక్షన్ల సునామీ
- బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన చిత్రం
- రెండో రోజు హిందీలోనే రూ. 70 కోట్ల వసూళ్లు
- షారుక్ ఖాన్ ఖాతాలో భారీ హిట్
దాంతో తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన బాలీవుడ్ సినిమాగా రికార్డు సృష్టించింది. యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ -2 తొలి రోజు (53.9 కోట్ల) కలెక్షన్స్ రికార్డును అధిగమించింది. బుధ, గురువారాల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా పఠాన్ చిత్రం ఏకంగా రూ. 235 కోట్లు రాబట్టింది. రెండో రోజు కేవలం హిందీలోనే రూ. 70 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. తెలుగు, తమిళంలో 2-3 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.