ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. డ్యాన్స్ వీడియో వైరల్

  • మూడు రోజుల క్రితం ఒక్కటైన కేఎల్ రాహుల్-అతియా శెట్టి
  • మేహా పటేల్ మెడలో మూడుముళ్లు వేసిన అక్షర్ పటేల్
  • పెళ్లి కారణంగా న్యూజిలాండ‌తో సిరీస్‌కు అక్షర్ దూరం
Axar Patel Tied long time partner Meha Patel

టీమిండియా క్రికెటర్లు వరుసగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్-అతియా శెట్టి ఇటీవల సైలెంట్‌గా పెళ్లి పీటలు ఎక్కగా, తాజాగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్ మేహా పటేల్‌ను పెళ్లాడాడు. గుజరాత్‌లోని వడోదరలో కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. 

సంప్రదాయ గుజరాతీ వస్త్రాలు ధరించిన వధూవరులు పెళ్లిలో చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ‘మాన్ మేరీ జాన్’ పాటకు ఇద్దరూ స్టెప్పులేసి అందరినీ అలరించారు. అంతకుముందు జరిగిన సంగీత్, మెహందీ కార్యక్రమాల్లోనూ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. పెళ్లి తర్వాత జరిగిన బరాత్‌లోనూ అక్షర్ డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా, వివాహం కారణంగా కివీస్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు.

More Telugu News