ప్రాణహాని లేని ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు... నాకు పాత వాహనమా?: రాజాసింగ్

  • తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయిస్తోందన్న రాజాసింగ్
  • అధికారులు మరమ్మతులు చేసి పంపించారని వెల్లడి
  • ఆ వాహనంలో తిరగకపోతే నోటీసులు పంపిస్తున్నారని ఆవేదన
  • అందులో తిరిగితే ఎక్కడ ఆగిపోతుందో తెలియదని వ్యాఖ్యలు
Raja Singh fires on Telangana govt

సీఎం కేసీఆర్ దృష్టిలో తన ప్రాణాలకు ఏమాత్రం విలువలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహాని లేని ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చారని, తనను మాత్రం పాత వాహనంతోనే సరిపెట్టుకోవాలంటున్నారని రాజాసింగ్ ఆరోపించారు. 

ఈ పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం పదేపదే మొరాయిస్తోందని, ఆ వాహనంలో తిరగకపోతే మాత్రం నోటీసులు పంపిస్తున్నారని వివరించారు. ఒకవేళ ఆ వాహనంలో తిరిగితే ఎక్కడ ఆగిపోతుందో అని ఆందోళన కలుగుతోందని తెలిపారు. రాజాసింగ్ చస్తే ఎంత? బతికితే ఎంత? అని కేసీఆర్ భావిస్తున్నారని మండిపడ్డారు. 

ఈ పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం వద్దని అధికారులకు గతంలోనే లేఖ రాశానని, కానీ వారు పాత వాహనానికి మరమ్మతులు చేసి తిరిగి తన వద్దకు పంపించారని రాజాసింగ్ వెల్లడించారు.

More Telugu News