KL Rahul: కేఎల్ రాహుల్ కు కోహ్లీ, ధోనీ ఖరీదైన కానుకలు... అంతా వట్టిదేనట!

The news that Kohli and Dhoni gave costly gifts to KL Rahul are baseless
  • ముంబయిలో కేఎల్ రాహుల్, అతియా శెట్టి వివాహం
  • కోహ్లీ రూ.2.17 కోట్ల కారు గిఫ్టుగా ఇచ్చాడని వార్తలు
  • ధోనీ రూ.80 లక్షల బైకు కానుకగా ఇచ్చాడని కథనాలు
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ వివాహం బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టితో జరగడం తెలిసిందే. పెళ్లి సందర్భంగా కేఎల్ రాహుల్ కు టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ రూ.2.17 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారు గిఫ్టుగా వచ్చాడని, ధోనీ రూ.80 లక్షల విలువైన కవాసాకి నింజా బైకును కానుకగా ఇచ్చాడని కథనాలు వచ్చాయి. 

అయితే, సునీల్ శెట్టి కుటుంబ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ కథనాలను కొట్టిపారేస్తున్నాయి. కోహ్లీ, ధోనీ ఖరీదైన గిఫ్టులు ఇచ్చారన్న కథనాల్లో నిజంలేదని, అవి నిరాధారమైన వార్తలని స్పష్టం చేశారు. ఈ వివాహంపై ప్రజలకు వార్తలు అందించే ముందు మీడియాతో తమతో నిర్ధారణ చేసుకోవాలని హితవు పలికారు.
KL Rahul
Athiya Shetty
Virat Kohli
MS Dhoni
Gifts

More Telugu News