గాళ్ ఫ్రెండ్ ను ఆకట్టుకునేందుకు ఖరీదైన బైకుల చోరీ

  • థానే జిల్లాలో ఇటీవల బైకుల చోరీ
  • దర్యాప్తు జరిపిన పోలీసులు
  • శుభమ్ భాస్కర్ అనే టీనేజి కుర్రాడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • 13 బైకుల స్వాధీనం
Youth stolen bikes to impress girl friend

మహారాష్ట్రలో ఓ కుర్రాడు తన ప్రేయసి ముఖంలో ఆనందం చూసేందుకు దొంగతనాల బాట ఎంచుకున్నాడు. అతడి పేరు శుభమ్ భాస్కర్ పవార్. వయసు 19 సంవత్సరాలు. థానే జిల్లాలోని కల్యాణ్ ప్రాంతంలో ఇటీవల వరుసగా బైకుల చోరీకి గురవుతుండడం పట్ల పోలీసులు దృష్టి సారించారు. 

దర్యాప్తు జరిపితే, ఆ బైకులు దొంగతనం చేసింది శుభమ్ భాస్కర్ పవార్ అని తేలింది. విచారణలో ఆసక్తికర అంశం వెల్లడైంది. తన గాళ్ ఫ్రెండ్ ను కానుకలతో ఆకట్టుకోవడం కోసమే అతడు ఖరీదైన బైకులను చోరీ చేసేవాడని కల్యాణ్ ఏరియా డీసీపీ సచిన్ ముంజాల్ వెల్లడించారు. 

మొత్తం 13 బైకులు స్వాధీనం చేసుకున్నారు. లాతూర్, షోలాపూర్, పుణే ప్రాంతాల్లో ఆ బైకులను గుర్తించారు. శుభమ్ భాస్కర్ దొంగలించిన బైకుల విలువ రూ.16.05 లక్షలు అని డీసీపీ తెలిపారు.  కాగా, పోలీసులు ఆ కుర్రాడిని కోర్టులో హాజరుపర్చనున్నారు.

More Telugu News