వొడాఫోన్ ఐడియా రిపబ్లిక్ డే ఆఫర్

On Republic Day 2023 Vodafone idea is offering free 5GB data
  • రూ.199-299 రీచార్జ్ పై 2జీబీ డేటా ఉచితం
  • రూ.299కు పైన ప్లాన్లపై 5జీబీ ఉచిత డేటా
  • వొడాఫోన్ ఐడియా యాప్ నుంచి రీచార్జ్ చేసుకునే వారికి ప్రయోజనం
వొడాఫోన్ ఐడియా రిపబ్లిక్ డే సందర్భంగా తన కస్టమర్లకు ఓ ప్రత్యేకమైన ఆఫర్ ను ప్రకటించింది. రూ.199, అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే ప్రీపెయిడ్ కస్టమర్లకు ఉచిత డేటాను అందిస్తోంది. ఈ ప్రయోజనాన్ని పొందేందుకు యూజర్లు వీఐ యాప్ డౌన్ లోడ్ చేసుకుని, అందులో కస్టమర్ గా రిజిస్టర్ అయి రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

రూ.199 నుంచి రూ.299 మధ్య ప్లాన్ రీచార్జ్ చేసుకునే వారికి 2జీబీ అదనపు డేటా ఉచితంగా లభిస్తుంది. రూ.299కి పైన ప్లాన్ రీచార్జ్ చేసుకునే వారు 5జీబీ అదనపు డేటా పొందొచ్చు. ఇది రిబ్లిక్ డే ఆఫర్ అయినప్పటికీ ఫిబ్రవరి 7 వరకు అందుబాటులో ఉంటుందని వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. రీచార్జ్ చేసుకున్న తర్వాత లభించే అదనపు ఉచిత డేటా 28 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. వొడాఫోన్ ఐడియా తన ప్రీపెయిడ్ ప్లాన్లపై రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల్లోపు డేటాను పూర్తి ఉచితంగా ఎప్పటి నుంచో అందిస్తోంది. 

Go Back to Shorts
Vodafone idea
Republic Day
offer
5GB data
free data

More Telugu News