Kamal Haasan: ఈరోడ్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి ఇళంగోవన్‌కు కమల్ మద్దతు

  • ఫిబ్రవరి 27న ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నిక
  • ఎస్‌పీఏ తరపున కాంగ్రెస్ నుంచి బరిలోకి ఇళంగోవన్
  • మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకే మద్దతునిచ్చామన్న కమల్
Kamal Haasan to support EVKS Elangovan in Erode bypolls

వచ్చే నెల 27న తమిళనాడులోని ఈరోడ్ తూర్పు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (ఎస్‌పీఏ) అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవన్ బరిలోకి దిగారు. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్ కమల హాసన్ ఆయనకు బేషరతు మద్దతు ప్రకటించారు. ఇళంగోవన్ తనయుడు తిరుమహాన్ ఎవెరా మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్న ఇళంగోవన్ ఇటీవల కమల్‌ను కలిసి మద్దతు కోరారు. 

ఈ నేపథ్యంలో పార్టీ గవర్నింగ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల సమావేశం నిర్వహించి ఆయనకు మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. కాగా, కమల్ పార్టీ ప్రకటించిన తర్వాత ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంపై మీడియా అడిగిన ప్రశ్నకు కమల్ సమాధానమిస్తూ.. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 

మతతత్వ శక్తులు ప్రజలు తినే తిండి సహా వారి జీవితాల్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. జాతీయ ప్రాముఖ్యతకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు విభేదాలను పక్కనపెట్టి ఒక్కటి కావాల్సిందేనని కమల్ స్పష్టం చేశారు.

More Telugu News