ఏపీ సీఎం జగన్‌ను కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబం
- ‘సిరివెన్నెల’ వైద్య ఖర్చులను భరించిన ఏపీ ప్రభుత్వం
- ఆయన కుటుంబానికి విశాఖలో స్థలం కేటాయింపు
- సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన సిరివెన్నెల కుటుంబం
- కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ
‘సిరివెన్నెల’ వైద్య ఖర్చులను ఏపీ ప్రభుత్వం భరించడంతోపాటు విశాఖపట్టణంలో ఆయన కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించిన నేపథ్యంలో జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. సిరివెన్నెల కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.