Pope Fansis: హోమో సెక్సువాలిటీపై పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు

  • హోమోసెక్సువాలిటీ నేరం కాదన్న పోప్ ఫ్రాన్సిస్
  • అందరి గౌరవాన్ని గౌరవించాలని వ్యాఖ్య
  • ఈ విషయంలో నేరం వేరు, పాపం వేరన్న పోప్
Pope Francis comments on homo sexuality

హోమో సెక్సువాలిటీపై క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోమో సెక్సువాలిటీ నేరం కాదని ఆయన అన్నారు. తన పిల్లలు ఎలా ఉన్నా దేవుడు ప్రేమిస్తాడని చెప్పారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను, అలాంటి వారి పట్ల వివక్షను ప్రదర్శించే చట్టాలను ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లోని కేథలిక్ బిషప్ లు సమర్థిస్తున్నారని ఆయన అన్నారు. అందరి గౌరవాన్ని బిషప్ లు గౌరవించాల్సి ఉంటుందని చెప్పారు. దేవుడికి అందరిపై సమానమైన ప్రేమ, దయ ఉంటాయని... బిషప్ లు కూడా అదే విధంగా వ్యవహరించాలని అన్నారు. హోమో సెక్సువాలిటీ విషయంలో నేరం వేరు, పాపం వేరని... ఈ తేడాను మొదట తెలుసుకుందామని చెప్పారు.

More Telugu News