Pawan Kalyan: రూ. 21 వేల కోట్లను దారి మళ్లించారు: పవన్ కల్యాణ్

Pawan Kalyan fires on YSRCP
  • ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్ష ఎదుర్కొంటారన్న పవన్ 
  • ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలను తొలగించారని ఆరోపణ  
  • వైసీపీ ప్రభుత్వ పబ్లిసిటీ కోసం రూ. 15 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శ 

వ్యక్తి ఆరాధన మంచిది కాదని... ప్రమాదకరమని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సమాజాన్ని కొన్ని కోణాల్లోనే కాకుండా సమగ్రంగా చూడాలని చెప్పారు. ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతాడని, అలా వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని అన్నారు. తాను కూడా వివక్షకు గురయ్యానని చెప్పారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ప్రయాణిస్తున్నప్పుడు తనకు నీళ్లు ఇవ్వడానికి ఒక బ్రిటీష్ మహిళ నిరాకరించిందని అన్నారు. 
 
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించకూడదని పవన్ చెప్పారు. బయట ఉండే శత్రువుల కంటే... మనతో ఉండే శత్రువులతోనే ప్రమాదం ఎక్కువని చెప్పారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలను తీసేశారని చెపుతుంటే బాధేస్తోందని అన్నారు. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు. ఈ మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన రూ. 20 వేల కోట్లను రాకుండా చేశారంటే ఏమనాలని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ. 15 వేల కోట్లను ఖర్చు చేసిందని... వైసీపీ రంగుల కోనం  రూ. 21,500 కోట్లను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. నిధులను దారి మళ్లించి ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News