హిందూపురంలో రేపు ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం.. పాల్గొననున్న బాలకృష్ణ

25-01-2023 Wed 07:41 | Andhra
  • పోలీసుల నుంచి ఇంకా  రాని అనుమతి
  • ముందస్తుగా దరఖాస్తు చేసుకున్నా పోలీసులు తటపటాయిస్తున్నారన్న టీడీపీ నేతలు
  • కార్యక్రమ నిర్వహణపై ఉత్కంఠ
Balakrishna To Attend Edem Kharma Rastraniki Event in Hindupur Tomorrow
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో రేపు టీడీపీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దీనికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు ఎటూ తేల్చిచెప్పకపోవడంతో కార్యక్రమ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. 

కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని చెబుతున్నప్పటికీ పోలీసులు అనుమతి ఇచ్చేందుకు తటపటాయిస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ముందస్తుగా అనుమతి కోరినా ఇంకా స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐ వెంకటేశ్వరరావు ఇదే విషయమై మాట్లాడుతూ.. రహదారిపై సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా నిరసన కార్యక్రమాలు మాత్రం నిర్వహించుకోవచ్చని తెలిపారు.