Shivraj Singh Chouhan: ప్రభుత్వ పాఠశాలల్లో హిందూ మత గ్రంధాలను బోధిస్తాం: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

  • గీత, రామచరితమానస్, వేదాల వంటి గ్రంధాలను బోధిస్తామన్న చౌహాన్
  • మనిషిని సంపూర్ణ వ్యక్తిగా మార్చే శక్తి వీటికి ఉందని వ్యాఖ్య
  • ఈ గ్రంధాలను బోధించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
Hindu religious texts will be taught in schools says Shivraj Singh Chouhan

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీత, రామచరితమానస్, వేదాల వంటి హిందూ మత గ్రంధాలను బోధిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ గ్రంధాలన్నీ చాలా అమూల్యమైనవని... మనిషిని సంపూర్ణ వ్యక్తిగా, నైతికత గల వ్యక్తిగా తీర్చిదిద్దే సామర్థ్యం ఈ గ్రంధాలకు ఉందని చెప్పారు. ఈ గ్రంధాలను బోధించాల్సిన అవసరం ఉందని ఒక ముఖ్యమంత్రిగా తాను చెపుతున్నానని అన్నారు. ఇతర సబ్జెక్టులతో పాటు హిందూ గ్రంధాలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తామని చెప్పారు.

More Telugu News