షారుక్ ఖాన్ ఎవరు? అన్న ముఖ్యమంత్రి.. రాత్రి 2 గంటలకు ఆయనకు ఫోన్ చేసిన బాలీవుడ్ బడా హీరో
- పఠాన్ చిత్రానికి వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలు
- అస్సాం సీఎం హిమంతకు ఫోన్ చేసిన షారుక్
- సినిమాకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఎం
కాగా, సినిమాకి వ్యతిరేకంగా ఓవర్గం చేస్తున్న హింసాత్మక నిరసనలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు షారుక్ ఖాన్ ఎవరని హిమంత అన్నారు. ‘షారుఖ్ ఖాన్ ఎవరు? నాకు ఆయన గురించి, పఠాన్ చిత్రం గురించి ఏమీ తెలియదు’ అని పేర్కొన్నారు. షారుక్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అని చెప్పినప్పుడు, రాష్ట్ర ప్రజలు అస్సామీ చిత్రాల గురించి ఆందోళన చెందాలని, బాలీవుడ్ కాదు అని ఆయన అన్నారు. గౌహతిలో ‘పఠాన్’ సినిమాను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్న ఓ థియేటర్‌లో కొందరు కార్యకర్తలు సినిమా పోస్టర్లను చింపివేయడంపై ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. షారుక్ నుంచి తనకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని. నటుడు ఫోన్ చేసి తనను కోరితే తాను ఆ విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ఎవరైనా నిరసనకారులు చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో షారుక్ కొన్ని గంటల్లోనే సీఎంకు ఫోన్ చేయడం గమనార్హం.