RRR: హాలీవుడ్ సినిమా చేయాలనుకుంటే నాకు చెప్పండి.. జక్కన్నతో దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్

If you ever wanna make a movie over here lets talk Offers James Cameron to SS Rajamouli
  • ఆర్ఆర్ఆర్ రెండు సార్లు చూశానని, అద్భుతం అని కితాబు
  • సంగీతం బాగుందని కీరవాణిని అభినందించిన కామెరూన్
  • కామెరూన్, రాజమౌళి మధ్య సంభాషణ వీడియోను విడుదల చేసిన చిత్ర బృందం
బాహుబలి 1, 2 సినిమాలతో దేశంలోనే అగ్ర దర్శకుడిగా మారిపోయిన ఎస్.ఎస్.రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. ఆ చిత్రానికి వరుస పెట్టి ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు లభిస్తున్నాయి. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. నాటు నాటు పాటకు వరించిన ఈ అవార్డును అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో చిత్ర బృందం స్వీకరించింది. 

ఇటీవల ఓ కార్యక్రమంలో రాజమౌళి, హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ గురించి ఇద్దరూ ముచ్చటించారు. ఈ విషయాన్ని రాజమౌళి ఇదివరకే ప్రకటించగా.. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య జరిగిన పూర్తి సంభాషణ వీడియోను ఆర్ఆర్ ఆర్ చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. కామెరూన్ తెరకెక్కించిన టైటానిక్, అవతార్ చూశానంటూ రాజమౌళి ఆయనకు చెప్పారు. 

తాను ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూశానని కామెరూన్ తెలియజేశారు. అంతేకాదు చిత్రంలో తనకు నచ్చిన అంశాలను వివరించారు. నీరు, నిప్పు, కథతో అద్భుతంగా తీశారంటూ కొనియాడారు. మ్యూజిక్ మరింత అద్భుతంగా ఉందని, ప్రతీ సీన్ ను రక్తికట్టించిందన్నారు. కొన్ని సన్నివేవాలకు లేచి నిల్చున్నానని అన్నారు. మీరే కదా సంగీతం అందించింది అంటూ పక్కనే ఉన్న ఎంఎం కీరవాణిని సైతం అభినందించారు. కామెరూన్ ఈ చిత్రాన్ని రెండు సార్లు చూశారని ఆయన భార్య చెప్పారు. తను ఓసారి చూసి బాగుందని చెప్పి.. మళ్లీ తనతో కలిసి మరోసారి చూశారని, రెండోసారి కూడా రెప్పవాల్చకుండా చూశారని అనడంతో జక్కన్న పట్టరాని సంతోషంతో మునిగిపోయారు. చివరకు ‘భవిష్యత్తులో మీరు ఇక్కడ (హాలీవుడ్ లో) సినిమా తీసే ఉద్దేశం ఉంటే తనని సంప్రదించాలని రాజమౌళికి కామెరూన్ చెప్పడం కొసమెరుపు.
RRR
SS Rajamouli
James Cameron
Hollywood

More Telugu News