Konda Surekha: కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి: కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Konda Surekha demands to suspend Komatireddy from Congress
  • అందరం కలిసి పని చేయకపోవడం వల్లే  కాంగ్రెస్ ఓడిపోయిందన్న సురేఖ
  • కోమటిరెడ్డి వల్ల పార్టీకి చాలా నష్టం జరిగిందని వ్యాఖ్య
  • వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడొద్దన్న రేవంత్
అందరం కలిసి పని చేయకపోవడం వల్లే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలయిందని ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇప్పటికైనా అందరం కలిసి ఐకమత్యంతో పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వల్ల పార్టీకి చాలా నష్టం జరిగిందని... ఆయనను పార్టీ నుంచి సస్సెండ్ చేయాలని అన్నారు. అయితే ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కల్పించుకున్నారు. సమావేశం అజెండాలో ఉన్న అంశాలపైనే మాట్లాడాలని... వ్యక్తిగత అంశాలు, డిమాండ్లు, ఫిర్యాదులు ఏమైనా ఉంటే పార్టీ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. గాంధీభవన్ లో ఈరోజు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు.
Konda Surekha
Komatireddy Venkat Reddy
Revanth Reddy
Congress

More Telugu News