Narendra Modi: హైదరాబాద్ కు మోదీ.. పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ

PM Modi coming to Hyderabad
  • ఫిబ్రవరి 13న హైదరాబాద్ కు వస్తున్న మోదీ
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
  • తెలంగాణలో ప్రారంభమైన ఎన్నికల వేడి
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారయింది. ఫిబ్రవరి 13న ఆయన హైదరాబాద్ కు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగసభలో ఆయన పాల్గొని, ప్రసంగించనున్నారు. 

వాస్తవానికి ఈ నెలలోనే నగరానికి ఆయన రావాల్సి ఉంది. ఈ నెల 19న సికింద్రాబాద్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభానికి ఆయన రావాల్సి ఉన్నప్పటికీ... ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ నెల 15కి కార్యక్రమాన్ని మార్చారు. ఆ రోజున ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ గా వందేభారత్ రైలును ప్రారంభించారు. అప్పుడు వాయిదా పడిన హైదరాబాద్ పర్యటనను వచ్చే నెలకు మార్చారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ నేతలు క్రమం తప్పకుండా తెలంగాణకు వస్తున్నారు. వచ్చే నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రానికి రాబోతున్నారు.
Narendra Modi
BJP
Hyderabad
KCR
BRS

More Telugu News