fruits: పరగడుపున పండ్లను తినడం ఎంత వరకు కరెక్ట్?

  • ఉదయాన పండ్లు తినడం వల్ల డీటాక్సిఫికేషన్ కు ప్రేరణ
  • అయితే అందరికీ ఇది అనుకూలం కాదు
  • అసిడిటీ, జీర్ణాశయ సమస్యలు, జలుబు, అలర్జీ సమస్యలుంటే తీసుకోకూడదు
Is it healthy to eat fruits in the morning Lets find out

ఉదయం తొలి ఆహారం కింద పండ్లను తీసుకోవచ్చా? ఈ సందేహం చాలా మందికి వస్తుంటుంది. కొందరు మాత్రం తమకు నచ్చిన పండు తినేస్తుంటారు. ఉదయాన్నే పండ్లు తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో పరగడుపున పండ్లు తింటే కొందరికి సరిపడదు. కనుక ఇది వ్యక్తుల శరీర స్వభావాన్ని బట్టి మారిపోతుంటుంది. 

పండ్లు తిన్న తర్వాత ఏమవుతుంది?
ప్రతి పండులోనూ భిన్నమైన రసాయనాలు, ఎంజైమ్స్, యాసిడ్స్ ఉంటాయి. వీటిని తిన్న తర్వాత మన పేగుల్లోని బ్యాక్టీరియాతో కలసినప్పుడు చర్య జరుగుతుంది. కొందరికి ఎలాంటి ఇబ్బంది లేకపోతే, కొందరికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. 

వీరికి వద్దు...
అసిడిటీ సమస్య ఉన్న వారు పరగడుపున పండ్లను తినకూడదు. గ్యాస్, జలుబు, దగ్గు, సైనసైటిస్, అలర్జీలు, ఆస్థమా, బ్రాంకైటిస్, శ్వాసకోస సమస్యలున్న వారు పరగడుపున పండ్లకు దూరంగా ఉండాలి. మధుమేహం, అధిక బరువు ఉన్న వారికి కూడా ఇదే వర్తిస్తుంది. 

వీరు తినొచ్చు..
మలబద్ధకం సమస్య ఉన్న వారు పరగడుపున పండ్లను తినొచ్చు. అలాగే పొడి చర్మం, బలహీన జీర్ణశక్తి, బలహీన జీవక్రియలు ఉన్న వారు కూడా పొద్దున్నే పండ్లను తినొచ్చు. ఇలాంటి వారిలో పరగడుపున పండ్లను తీసుకోవడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. జీర్ణరసాలకు ప్రేరణ లభిస్తుంది. పండ్లను ఉడికించి తింటే ఇంకా మంచిది. 

మిక్స్ చేయకూడదు
పండ్లను విడిగానే తినాలి. కూరగాయలు, పాల ఉత్పత్తులు, ధాన్యాలు, పప్పులతో కలిపి తీసుకుంటే టాక్సిక్ గా మారుతుంది. కాకపోతే ఒకే గ్రూపునకు చెందిన పండ్లు, డ్రై ఫ్రూట్స్ తో కలిపి తీసుకోవచ్చు. పండ్లలో సిట్రిక్ యాసిడ్, టార్టారిక్, ఫుమారిక్, ఆక్సాలిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్ ఉంటాయి. పాల ఉత్పత్తుల్లోని లాక్టిక్ యాసిడ్ తో కలసినప్పుడు వెంటనే స్పందిస్తాయి. కనుక పాలు పండ్లు కలిపి తీసుకోకూడదు. అలాగే, పండ్లు, కూరగాయలు, మాంసం, ధాన్యం కలిపి కూడా తీసుకోకూడదు. అసలు పండ్లను వేరే వాటితో కలపకుండా తినడమే మంచిది. లేదంటే జీవక్రియల్లో అసమతుల్యానికి దారితీస్తుంది.

ప్రయోజనాలు
మన శరీరంలో ఉదయం 7 - 11 గంటల మధ్య డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. పండ్లను తినడం వల్ల దీనికి కావాల్సిన శక్తి లభిస్తుంది. పండ్లు తేలిగ్గా జీర్ణమవుతాయి. పరగడుపున ముందుగా వీటిని తినడం వల్ల జీవక్రియలు చురుగ్గా మారతాయి. హుషారుగా ఉంటారు. ఉదయం లేచిన తర్వాత కార్బోహైడ్రేట్లు శరీరానికి ఎక్కువ కావాల్సి ఉంటుంది. పండ్ల రూపంలో ఇవి లభిస్తాయి.

More Telugu News