మీ శిక్షణకు రూ.75 వేలు ఖర్చయింది.. తిరిగివ్వండి!: తొలగించిన ఫ్రెషర్స్ కు విప్రో కంపెనీ నోటీసులు
- ఆ మొత్తాన్ని మాఫీ చేస్తున్నట్లు తర్వాత లేఖలు పంపిన కంపెనీ
- పనితీరు బాగాలేదంటూ 452 మంది ఫ్రెషర్లను తొలగించిన విప్రో
- కంపెనీ ప్రమాణాలకు సరిపోరంటూ ఆరోపించిన టెక్ దిగ్గజం
విప్రోలో ఇటీవల చేరిన 452 మంది ఫ్రెషర్లకు ఆ కంపెనీ షాక్ ఇచ్చింది. కంపెనీ అంతర్గత మదింపులో వారి పనితీరు బాగాలేదని తేలిందని చెబుతూ, వాళ్లను ఉద్యోగంలో నుంచి తీసేసింది. అంతేకాదు, శిక్షణ కోసం వారిపై కంపెనీ రూ.75 వేలు వెచ్చించిందని, ఆ మొత్తాన్ని కంపెనీకి కట్టేయాలని నోటీసులు కూడా పంపింది. ఓవైపు ఉద్యోగం ఊడిందన్న ఆవేదనలో ఉన్న వారికి ఈ నోటీసులు ఆందోళనలోకి నెట్టాయి. అయితే, ఈ మొత్తాన్ని మాఫీ చేస్తున్నట్లు విప్రో తాజాగా లేఖలు పంపడంతో కొంత ఉపశమనం దక్కింది.