Varalakshmi: ఇది రమాప్రభగారి చలవే: నటి వరలక్ష్మి

Varalakshmi Interview
  • చైల్డ్ ఆర్టిస్టుగా రాణించిన వరలక్ష్మి 
  • చెల్లెలి పాత్రలలోను పాప్యులర్
  • అలా చెన్నైలో సెటిల్ అయ్యామని వెల్లడి 
  • తాను ఆర్టిస్టుగా రావడానికి రమాప్రభ కారణమని వివరణ  

తెలుగు తెరపై వరలక్ష్మి పేరుతో రాణించినవారు చాలామందినే ఉన్నారు. వాళ్లలో 'బేబీ వరలక్ష్మి' గా ఇండస్ట్రీకి పరిచయమై, పాప్యులర్ అయిన వరలక్ష్మి ఒకరున్నారు. అక్కినేని 'అందాలరాముడు' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి వచ్చిన వరలక్ష్మి, ఆ తరువాత చెల్లెలు .. కూతురు పాత్రలలో ఎక్కువగా నటించారు. 

తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ .. "మాది భీమవరం .. నాన్నగారు సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో చెన్నైకి వచ్చారు. అందువలన మా ఫ్యామిలీ చెన్నైలో స్థిరపడింది. నా చిన్నతనంలోనే నాన్నగారు చనిపోవడం వలన .. అమ్మ అనారోగ్యం వలన మళ్లీ నేను భీమవరం వెళ్లలేకపోయాను" అని అన్నారు. 

ఒకసారి ఒక సినిమా షూటింగు చూడటానికి మా అమ్మగారు నన్ను తీసుకుని వెళితే, రమాప్రభ గారు నన్ను చూశారు. నాతో యాక్టింగ్ చేయించమని మా అమ్మగారికి సలహా ఇచ్చారు. అలా ఆమె ఇచ్చిన సూచన వల్లనే నేను యాక్టింగ్ వైపు వచ్చాను. ఈ రోజున నేను ఇలా ఉండటానికి రమాప్రభ గారే కారణం .. అందుకు ఆమెకి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News