అధికారం కోసమే నారా లోకేశ్ పాదయాత్ర: కాకాణి గోవర్ధన్

21-01-2023 Sat 11:02 | Andhra
  • ఈ నెల 17 నుంచి లోకేశ్ యువ గళం పాదయాత్ర
  • ఆయన గళాన్ని ఎవరు వింటారో చూడాలన్న కాకాణి
  • లోకేశ్ గళం వినే స్థితిలో రాష్ట్ర యువత లేదని వ్యాఖ్య
Kakani Govardhan Reddy comments on Nara Lokesh Padayatra
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువ గళం' పాదయాత్ర ఈ నెల 27న ప్రారంభంకానుంది. 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సుదీర్ఘంగా కొనసాగనుంది. మరోవైపు లోకేశ్ పాదయాత్రపై ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన గళం ఎందుకు వినిపిస్తున్నారో, ఆయన గళాన్ని ఎవరు వింటారో చూడాలని ఎద్దేవా చేశారు. ఆయన గళం వినాల్సిన స్థితిలో ఏపీ యువత లేదని అన్నారు. 

కేవలం అధికారం కోసమే పాదయాత్రను చేపడుతున్నారని విమర్శించారు. గతంలో ఆయన ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఏం సాధించారో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. లోకేశ్ పాదయాత్రతో టీడీపీకి ఒరిగేది ఏమీ లేదని అన్నారు. ఎవరు ఎన్ని యాత్రలు చేసినా మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.