'వినరో భాగ్యము విష్ణుకథ' లిరికల్ సాంగ్ రిలీజ్!

19-01-2023 Thu 20:29 | Entertainment
  • మరో ప్రేమకథా చిత్రంగా 'వినరో భాగ్యము విష్ణుకథ'
  • కథానాయికగా కశ్మీర పరదేశి పరిచయం
  • యూత్ కి నచ్చే బీట్ వదిలిన టీమ్  
  • వచ్చేనెల 17వ తేదీన సినిమా విడుదల   
Vinaro Bhagyamu Vishnu katha Lyrical Song Released

కిరణ్ అబ్బవరం హీరోగా 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో తెలుగు తెరకి కశ్మీర పరదేశి కథనాయికగా పరిచయమవుతోంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ అవుతోంది. ' ఓ బంగారం నీ చేయి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం. నా బంగారం కన్నెత్తి చూడగానే నిద్రలే మానేసి జాగారం' అంటూ ఈ పాట సాగుతోంది. ప్రియరాలి తలపుల్లో తేలిపోతూ హీరో పాడుకునే పాట ఇది.

చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి, భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు. కపిల్ కపిలన్ ఈ పాటను ఆలపించగా . రఘు కొరియోగ్రఫీ అందించాడు. ఈ పాట బీట్ యూత్ కి కనెక్ట్ అయ్యేలానే ఉంది. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.