AP NGO: సీఎం జగన్ ను కలిసిన ఏపీ ఎన్జీవో సంఘం నేతలు

AP NGO leaders met CM Jagan
  • ఏపీ ఎన్జీవో సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవం
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన కార్యవర్గ సభ్యులు
  • డీఏ విషయం ప్రస్తావించామన్న బండి శ్రీనివాసరావు
  • సర్క్యులర్ నేడు ప్రాసెస్ చేస్తారని వెల్లడి
ఏపీ ఎన్జీవో సంఘం నేతలు నేడు సీఎం జగన్ ను కలిశారు. ఇటీవల ఏపీ ఎన్జీవో సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ నేపథ్యంలో, ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఇతర కార్యవర్గ సభ్యులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. సీఎం జగన్ కు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించారు. పలు అంశాలపై వారు సీఎంతో చర్చించారు.  

అనంతరం బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. సంక్రాంతికి డీఏ ఇస్తామన్న ప్రభుత్వ హామీని సీఎంకు గుర్తుచేశామని వెల్లడించారు. అయితే సెలవుల వల్ల డీఏ చెల్లింపు సర్క్యులర్ ప్రాసెస్ కాలేదని చెప్పారని వివరించారు. ఇవాళ సర్క్యులర్ ప్రాసెస్ చేస్తామని సీఎంవో అధికారులు చెప్పారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఉద్యమానికి సిద్ధమని స్పష్టం చేశారు.
AP NGO
Bandi Srinivasarao
CM Jagan
Tadepalli

More Telugu News