మాకు ఓటు బ్యాంకు ముఖ్యం కాదు: మోదీ

19-01-2023 Thu 16:19 | National
  • ఓటు బ్యాంకు రాజకీయాలకు బీజేపీ ప్రాధాన్యతను ఇవ్వదన్న ప్రధాని
  • కర్ణాటకలో 150 స్థానాల్లో విజయమే తమ లక్ష్యమని వ్యాఖ్య
  • యాద్గార్ జిల్లాలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన
Vote bank is no important for us  says Modi
దేశ అభివృద్ధే తమకు ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో (కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం) అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వచ్చే 25 ఏళ్లలో దేశానికి, దేశంలోని ప్రతి పౌరుడికి అమృత కాలమని.. ఈ సమయంలోనే దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్ గా నిర్మించుకోవాలని అన్నారు. పరిశ్రమలను విస్తరించడం, మంచి పంటలను పండించడం వంటి కార్యక్రమాల ద్వారానే మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి దేశంలో కేవలం 3 కోట్ల ఇళ్లకు మాత్రమే కుళాయి ద్వారా నీళ్లు వచ్చేవని... ఇప్పుడు 11 కోట్ల ఇళ్లకు అందుతున్నాయిని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీకి ఈ ఏడాది మే నెల లోపల ఎన్నికలు వస్తాయని చెప్పారు. కర్ణాటకలో 224 అసెబ్లీ స్థానాలు ఉండగా... 150 చోట్ల విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. బీజేపికి ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యం కాదని... ఇలాంటి రాజకీయాలకు బీజేపీ ప్రాధాన్యతను ఇవ్వదని చెప్పారు. కర్ణాటక యాద్గిర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.