సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

Police files case on minister Ambati Rambabu
  • అంబటి నేతృత్వంలో సంక్రాంతి లక్కీ డ్రా టికెట్ల విక్రయం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన నేతలు
  • కేసు నమోదు చేయని పోలీసులు
  • కోర్టును ఆశ్రయించిన జనసేన నేతలు
  • కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు కోర్టు ఆదేశాలు
ఇటీవల సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్ట కింద ఈ కేసు నమోదు చేశారు. 

సంక్రాంతి లక్కీ డ్రా పేరిట మంత్రి అంబటి నేతృత్వంలో టికెట్లు అమ్ముతున్నారంటూ జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించకపోవడంతో జనసేన నేతలు గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం... మంత్రి అంబటిపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు మంత్రిపై కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
Ambati Rambabu
Case
Police
Sankranti Lucky Draw
Tickets
Sattenapalle

More Telugu News