యాదాద్రిలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు
- లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న సీఎంలు
- కేసీఆర్ తో కలిసి ఆలయానికి పినరయి, కేజ్రీవాల్, మాన్
- పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రి చేరుకున్న సీఎంలు కేసీఆర్, పినరయి, కేజ్రీవాల్, మాన్ లకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్, కేజ్రీవాల్, మాన్ లు స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. తర్వాత వేదమంత్రాలతో ముఖ్యమంత్రులను అర్చకులు ఆశీర్వదించారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఎంపీ సంతోష్ కుమార్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.