ఉత్కంఠను పెంచుతున్న 'హంట్' ట్రైలర్!

18-01-2023 Wed 12:46 | Entertainment
  • సుధీర్ బాబు హీరోగా రూపొందిన 'హంట్'
  • యాక్షన్ ఎంటర్టయినర్ జోనర్లో సాగే కథ
  • ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న శ్రీకాంత్ 
  • ఈ నెల 26వ తేదీన విడుదలవుతున్న సినిమా
HUNT movie trailer Released
సుధీర్ బాబు హీరోగా 'హంట్' సినిమా రూపొందింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించాడు. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

కథానాయకుడు అర్జున్ ఓ పోలీస్ ఆఫీసర్. అతను ఒక కేసుకు సంబంధించిన పరిశోధన జరుపుతూ ఉండగా, ప్రమాదానికి గురవుతాడు. ఫలితంగా మెమరీ లాస్ అవుతాడు. అయినా అతను ఆ కేస్ ను ఎలా డీల్ చేశాడు? ఆ ప్రయత్నంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు? అనేదే కథ. 

శ్రీకాంత్ .. భరత్ ఇద్దరూ కూడా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్స్ గా కనిపించనున్నారు. సుధీర్ బాబు సరసన చిత్ర శుక్లా కథానాయికగా అలరించనుంది. గతంలో కొన్ని తెలుగు సినిమాలు చేసిన ఆమె సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.