‘పాప్ కార్న్’ మూవీ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన చైతూ!

18-01-2023 Wed 12:14 | Entertainment
  • విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా 'పాప్ కార్న్'
  • షాపింగ్ మాల్ లో నడిచే ఆసక్తికరమైన కథ 
  • సాయి రోనక్ జోడీగా అవికా గోర్ సందడి  
  • సంగీతాన్ని సమకూర్చిన శ్రావణ్ భరద్వాజ్
  • వచ్చేనెల 10వ తేదీన సినిమా రిలీజ్
Pop Corn lyrical song released
అవికా గోర్‌ - సాయి రోన‌క్ జంట‌గా నటించిన చిత్రం ‘పాప్ కార్న్’. భోగేంద్ర గుప్తా నిర్మించిన ఈ సినిమాకి మురళీ గంధం ద‌ర్శ‌కత్వం వహించాడు. ఫిబ్రవరి 10న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా బుధ‌వారం రోజున ‘మ‌ది విహంగ‌మ‌య్యే ..’ అనే లిరికల్ సాంగ్‌ను హీరో నాగచైత‌న్య‌ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.

ఓ షాపింగ్ మాల్‌లోనే ఈ పాటంతా సాగుతుంది. హీరో హీరోయిన్లు అందులో షాపింగ్ చేయ‌టానికి వ‌చ్చిన‌ప్పుడు వారి ఆలోచ‌న‌లు.. ఎంత వేగంగా వారి భ‌విష్య‌త్తు వైపు దూసుకెళ్తున్నాయ‌నే విష‌యాన్ని చ‌క్క‌టి లిరిక్స్‌తో పాట‌లో పొందుప‌రిచారు లిరిక్ రైట‌ర్ శ్రీజో. శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్ సంగీతం అందించిన ఈ పాట‌ను బెన్నీ ద‌యాల్‌, ర‌మ్యా బెహ్రా ఆల‌పించారు. 

ఈ సినిమాను గురించి మేకర్స్ మాట్లాడుతూ .. 'పాప్ కార్న్’ మూవీని ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు రాన‌టువంటి ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీ ఇది. సినిమా అంతా లిఫ్టులోనే ఉంటుంది. ముఖ్యంగా చివ‌రి 45 నిమిషాలు అయితే సీట్ ఎడ్జ్ మూవీలా ఉంటుంది. పెద్ద‌ల‌కు వారి యంగ్ ఏజ్ గుర్తుకు వ‌స్తుంది. ఇప్ప‌టి యువ‌త‌కు కూడా క‌నెక్ట్ అవుతుంది. అన్ని ర‌కాల ఎమోష‌న్స్ ఉన్న సినిమా, అన్ని వర్గాల వారికి తప్పకుండా నచ్చుతుంది" అని చెప్పుకొచ్చారు.