చివరి నిజాంకు నివాళి అర్పించిన కేసీఆర్.. ఫొటోలు ఇవిగో

17-01-2023 Tue 21:54 | Telangana
  • శనివారం రాత్రి ఇస్తాంబుల్ లో కన్నుమూసిన ముకర్రమ్ జా
  • రేపు మక్కా మసీదులో అంత్యక్రియలు
  • నిజాం కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్
KCR pays tributes to Nizam
ఎనిమిదవ, చివరి నిజాం నవాబు ముకర్రమ్ జా శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్ లో కన్నుమూశారు. ఈరోజు ఆయన పార్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తీసుకొచ్చారు. చౌమొహల్లా ప్యాలెస్ లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. ఆయన భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. నిజాం కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ సైతం నిజాంకు నివాళి అర్పించారు. 

మరోవైపు ముకర్రమ్ జా చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలను చార్మినార్ పక్కనున్న మక్కా మసీదులో నిర్వహించనున్నారు. అక్కడే ఆయనను ఖననం చేయనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.