YS Sharmila: జాతీయ రాజకీయాలెందుకు?.. కేసీఆర్ కు షర్మిల లేఖ

  • భవిష్యత్తు లేని బీఆర్ఎస్ అజెండాను దేశ ప్రజలపై రుద్దుతున్నాారని విమర్శ
  • ఏపీలో కలిపిన 7 మండలాలపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్న
  • సీతారామ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదన్న షర్మిల
Sharmila letter to KCR


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. ఏమాత్రం భవిష్యత్తు లేని బీఆర్ఎస్ అజెండాను దేశ ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని లేఖలో ఆమె విమర్శించారు. తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీలో విలీనం చేశారని... దీనిపై మీరు ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. 

ఎనిమిదేళ్ల పాలన పూర్తవుతున్నా సీతారామ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని అడిగారు. గిరిజనులకు ఇంత వరకు పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. భద్రాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్న మీ హామీ ఏమయిందని నిలదీశాలరు. తెలంగాణనే అభివృద్ధి చేయలేని మీకు.. జాతీయ రాజకీయాలు ఎందుకని ఎద్దేవా చేశారు.

More Telugu News