Rahul Gandhi: వరుణ్ గాంధీపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rahul Gandhi comments on Varun Gandhi
  • తమ కుటుంబానికి ఒక భావజాలం ఉందన్న రాహుల్
  • వరుణ్ మరో భావజాలాన్ని స్వీకరించారని వ్యాఖ్య
  • తాను వరుణ్ ను కౌగిలించుకోగలనన్న రాహుల్
రక్త సంబంధీకులైనా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీల మధ్య అనుబంధం ఎక్కడా కనిపించదు. మేనకాగాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలు బీజేపీలో ఉంటున్నారు. తాజాగా వరుణ్ గురించి రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి ఒక భావజాలం ఉందని... కానీ వరుణ్ మరో భావజాలాన్ని స్వీకరించారని చెప్పారు. వరుణ్ ను తాను కౌగిలించుకోగలనని, ప్రేమతో మాట్లాడగలనని చెప్పారు. కానీ వరుణ్ పుచ్చుకున్న రాజకీయ భావజాలాన్ని తాను స్వీకరించలేనని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో వరుణ్ పాల్గొంటారనే వార్తలు చక్కర్లు  కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Rahul Gandhi
Congress
Varun Gandhi
BJP

More Telugu News