చూపులతో కట్టిపడేస్తున్న జాన్వీ కపూర్ .. లేటెస్ట్ పిక్స్!
- బాలీవుడ్ బ్యూటీగా జాన్వీకి మంచి క్రేజ్
- సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ఆమెకి అలవాటు
- ప్రస్తుతం చేతిలో రెండు ప్రాజెక్టులు
- ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో చేయనుందంటూ టాక్
అలాంటి జాన్వీ కపూర్ లేటెస్ట్ పిక్స్ యూత్ కళ్లు తిప్పుకోకుండా చేస్తున్నాయి. క్రీమ్ కలర్ డ్రెస్ లో జాన్వీ అందాల జలపాతంలా .. విరబూసిన విరజాజి వనంలా కనిపిస్తోంది. ఈ తరం అతిలోక సుందరిగా అనిపిస్తోంది. చేపకళ్ల చూపులతో అందరినీ తన అభిమానులుగా మార్చేస్తోంది.అందానికే అసూయ పుట్టించేలా ఉన్న జాన్వీ కపూర్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక తెలుగులో ఆమె కొరటాల - ఎన్టీఆర్ కాంబోలో చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శ్రీదేవి వారసురాలిగా ఆమెను తెలుగు తెరపై చూడాలనుకుంటున్న వారి ముచ్చటను ఈ సినిమా తీరుస్తుందేమో చూడాలి.