Uttar Pradesh: మథురలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై ఇద్దరు బాలుర అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్‌మెయిల్!

Minor Girl molested by Two Minor Boys in UPs Mathura
  • ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలురు
  • విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని హెచ్చరిక
  • పొరిగింటి అబ్బాయిలే నిందితులు 
ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో దారుణం జరిగింది. 9 ఏళ్ల బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను వీడియో తీసి ఆపై బ్లాక్‌మెయిుల్‌కు  పాల్పడ్డారు. విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని హెచ్చరించినట్టు పోలీసులు తెలిపారు. బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు హైవే పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ చోటే లాల్ తెలిపారు. 

వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. బాధిత బాలిక కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న పొరుగింట్లో ఉన్న ఇద్దరు బాలురు ఇంట్లోకి చొరబడి బాలికను వేధించడం మొదలుపెట్టారు. ఆమె ప్రతిఘటించడంతో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడియో తీసిన మైనర్లు విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బాలికను బెదిరించారు.
Uttar Pradesh
Mathura
Molested
Crime News

More Telugu News