Advertisement

నేడు మూడో వన్డే... టాస్ గెలిచిన భారత్

Team India won the toss against Sri Lanka in 3rd ODI
  • ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా
  • తిరువనంతపురంలో నామమాత్రపు చివరి వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
  • హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్ లకు విశ్రాంతి
  • జట్టులోకి వచ్చిన సూర్యకుమార్, వాషింగ్టన్ సుందర్
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ ను ఇప్పటికే టీమిండియా గెలిచిన నేపథ్యంలో, నేడు తిరువనంతపురంలో నామమాత్రపు చివరి వన్డే జరుగుతోంది. ఇక్కడి గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 8 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 51 పరుగులు. శుభ్ మాన్ గిల్ 30, కెప్టెన్ రోహిత్ శర్మ 17 పరుగులతో ఆడుతున్నారు. 

కాగా, ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్ లకు విశ్రాంతినిచ్చారు. సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. అటు, శ్రీలంక జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి. ధనంజయ డిసిల్వా, దునిత్ వెల్లాలగే స్థానంలో అషేన్ బండార, జెఫ్రీ వాండర్సే తుదిజట్టుకు ఎంపికయ్యారు.
Advertisement
Team India
Sri Lanka
Toss
3rd ODI

More Telugu News