Team India: టీమిండియా బౌలర్ల ధాటికి శ్రీలంక 215 ఆలౌట్

Team India bowlers restricts Sri Lanka 215 runs in 2nd ODI
  • టీమిండియా, శ్రీలంక మధ్య రెండో వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • 39.4 ఓవర్లలోనే చాపచుట్టేసిన లంకేయులు
  • మూడేసి వికెట్లు పడగొట్టిన సిరాజ్, కుల్దీప్
  • ఉమ్రాన్ మాలిక్ కు 2 వికెట్లు 
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంకతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక టీమిండియా బౌలర్ల ధాటికి 39.4 ఓవర్లలో 215 ఆలౌట్ అయింది. లంక లోయర్ ఆర్డర్ పోరాడబట్టి ఆ మాత్రమైనా స్కోరు వచ్చింది. 

లంక జట్టులో కొత్త ఓపెనర్ నువనిదు ఫెర్నాండో 50 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కుశాల్ మెండిస్ 34, దునిత్ వెల్లాలగే 32, కరుణరత్నే 17, కసున్ రజిత 17 పరుగులు చేశారు. గత మ్యాచ్ లో వీరోచిత సెంచరీతో అలరించిన లంక సారథి దసున్ షనక ఈ మ్యాచ్ లో 2 పరుగులకే వెనుదిరిగాడు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, కుల్దీప్ యాదవ్ 3, ఉమ్రాన్ మాలిక్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.
Team India
Sri Lanka
2nd ODI
Eden Gardens
Kolkata

More Telugu News