Team India: సగం ఓవర్లకే ఆరు వికెట్లు కోల్పోయిన శ్రీలంక

  • అదరగొడుతున్న భారత బౌలర్లు
  • కుల్దీప్ యాదవ్ కు మూడు వికెట్లు
  • నువానిడు అర్ధ సెంచరీ
srilanka lose 6 wickets early

సిరీస్ నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా.. శ్రీలంకతో రెండో వన్డేలో అద్భుత ప్రదర్శన చేస్తోంది. భారత బౌలర్లు చెలరేగిపోతున్నారు. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న లంక నడ్డి విరిచారు. 25 ఓవర్లకు లంక 133 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (20), నవానిడు ఫెర్నాండో (50), కుశాల్ మెండిస్ (34) రాణించినా.. వరుసగా వికెట్లు పడ్డాయి. అవిష్కను మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేసి తొలి వికెట్ పడగొట్టాడు. కుశాల్ మెండిస్ ను కుల్దీప్ యాదవ్ ఎల్బీ చేశాడు. ఆ వెంటనే ధనంజయ డిసిల్వాను అక్షర్ పటేల్ డకౌట్ చేశాడు. 

అరంగేట్రం మ్యాచ్ లో అర్ధ సెంచరీతో రాణించిన నువానిడు రనౌట్ కావడంతో లంక నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం ఆగలేదు. సూపర్ ఫామ్ లో ఉన్న దసున్ షనక రెండు పరుగులే చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తన తర్వాతి ఓవర్లోనే చరిత్ అసలంక (15)ను కుల్దీప్ యాదవ్ రిటర్న్ క్యాచ్ తో పెవిలియన్ చేర్చడంతో లంక కష్టాలు మరింత పెరిగాయి.

More Telugu News