కొడాలి నాని పీడ విరగడవ్వాలంటూ టీడీపీ నేతల పూజలు
- కొడాలి నానికి వ్యతిరేకంగా రావి వెంకటేశ్వరరావు వినూత్న కార్యక్రమం
- గుడివాడ సైకో పోవాలంటూ కార్యక్రమం
- కొడాలి నాని అనే శనిని అంతమొందించే రోజులు దగ్గరపడ్డాయన్న రావి
గుడివాడకు పట్టిన కొడాలి నాని అనే శనిని అంతమొందించే రోజులు దగ్గరపడ్డాయని ఆయన అన్నారు. నియోజకవర్గ ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయకత్వంలో పోరాడుతామని వెంకటేశ్వరరావు చెప్పారు. అంతేకాదు గుడివాడకు కొడాలి నాని పీడ విరగడవ్వాలని కోరుతూ విజయవాడ అమ్మవారికి టీడీపీ శ్రేణులు పూజలు నిర్వహించాయి. 'సైకో పోవాలి.. సైకిల్ రావాలి' అంటూ అమ్మవారి ఆలయం వెలుపల 108 సార్లు నినాదాలు చేశారు.