Tollywood: ఆసక్తికరంగా అరవింద్ కృష్ణ 'అండర్ వరల్డ్ బిలియనీర్స్' వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్

Underworld Billionaires web series first look revealed
  • వైవిధ్యమైన కాన్సెప్ట్ తో రూపొందిన వెబ్ సిరీస్
  • దర్శకత్వం వహించిన గగన్ గోపాల్ ముల్క 
  • షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సిరీస్
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా గుర్తింపు సంపాదించుకున్న అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న వెబ్ సిరీస్ 'అండర్ వరల్డ్ బిలియనీర్స్'. వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తూనే ఆయన మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. గగన్ గోపాల్ ముల్క దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ను ఎల్ ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎల్. శ్రీనివాసులు, దీవి వేణుగోపాల్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా వైవిధ్యమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సిరీస్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. అరవింద్ కృష్ణ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న పోస్టర్ సిరీస్ పై అంచనాలను పెంచింది. 

అరవింద్ కృష్ణ సరసన రాధిక ప్రీతి హీరోయిన్ గా నటిస్తోంది. మధు సూధన్, జ్యోతి రాయ్, షవర్ అలీ, అలోక్ జైన్, లీనా కపూర్, రవి మల్లిడి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సిరీస్ విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఎస్ చిన్నా సంగీతం అందించిన వెబ్ సిరీస్ కు టి. సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, జునైద్ సిద్ధిక్ ఎడిటర్ గా, పైడి రాజు నృత్య దర్శకుడిగా పని చేశారు.
Tollywood
web series
Underworld Billionaires
Arvind Krishna

More Telugu News