‘నాటు నాటు’ పాటకు అవార్డుపై చిరు హర్షం

  • కీరవాణిని అభినందిస్తూ ట్వీట్ చేసిన మెగాస్టార్
  • ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభినందనలు..
  • దేశం మొత్తం గర్విస్తోందన్న చిరంజీవి
chiranjeevi reaction on golden globe award for natunatu song

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై మెగస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాటకు కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈమేరకు సంగీత దర్శకుడు కీరవాణిని, సినిమాకు పనిచేసిన సిబ్బందిని మెచ్చుకుంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇదొక చారిత్రక విజయమని ట్వీట్ లో మెచ్చుకున్నారు.

‘ఆర్ఆర్ఆర్ టీమ్ కు నా అభినందనలు. దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. సంగీతం, డ్యాన్స్ ల సంబరమే ‘‘నాటు నాటు’’ పాట. దేశంతో పాటు ప్రపంచం మొత్తం మీతో కలిసి డ్యాన్స్ చేస్తోంది. తారక్, రామ్ చరణ్, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, దానయ్యగారు, డీవీవీ మూవీస్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కు అభినందనలు’ అంటూ మెగస్టార్ ట్వీట్ చేశారు. మరోవైపు, కీరవాణిని అభినందిస్తూ జూనియర్ ఎన్టీఆర్, ఏఆర్ రెహమాన్, క్రిష్ కూడా ట్వీట్ చేశారు.

More Telugu News