సానియా మీర్జా తాజా పోస్ట్ అర్థం ఏమిటో!
- ఇద్దరి మధ్య కొంత అంతరం
- ఒకరిని దూరం పెట్టానంటే అది వారిలో తప్పున్నట్టు కాదన్న సానియా
- వారి ప్రవర్తన తనకు నచ్చలేదని వివరణ
సానియా మీర్జా ఇటీవలే తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఓ ఆలోచనాత్మక పోస్ట్ పెట్టింది. ‘‘మా సరిహద్దులు అన్నవి ఇతరులు నిర్ణయించేవి కావు. వారు ఎంతో సులభంగా మా అవసరాలను నిర్ణయించేస్తున్నారు. నేను ఒకరితో దూరం పెంచుకున్నాను అంటే అది వారి తప్పు కాదు. కొన్ని సందర్భాల్లో వారి ప్రవర్తన నాకు సరిగ్గా అనిపించకపోవచ్చు’’ అని సానియా మీర్జా పేర్కొంది. అంటే తన భర్త షోయబ్ తో తనకు అంతరం ఏర్పడినట్టు ఆమె పరోక్షంగా అంగీకరించింది. అంతేకానీ, తాము విడిపోతున్నామని ఆమె ఎప్పుడూ చెప్పలేదు.