TDP: తంబళ్లపల్లె టీడీపీ నేత కొండ్రెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించిన కలెక్టర్

  • ఓ కేసులో అరెస్ట్ అయిన మద్దిరెడ్డి కొండ్రెడ్డి
  • ఎస్పీ నివేదిక ఆధారంగా షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్
  • తరచూ గొడవలకు దిగే నేరస్థుడిగా కొండ్రెడ్డిని గుర్తించామన్న కలెక్టర్
  • బెయిలుపై జైలు నుంచి బయటకు రాగానే బహిష్కరణ ఉత్తర్వులు
  • ఆరు నెలలపాటు జిల్లా విడిచి వెళ్లాలని ఆదేశం
  • ట్రైబ్యునల్‌లో అప్పీలు కోసం 15 రోజుల గడువు
Tamballapalle TDP leader Kondreddy was expelled from the district by the Collector For Six Months

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డిని జిల్లా నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ కలెక్టర్ గిరీష ఆదేశాలు జారీ చేశారు. కురబలకోటలో జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన కొండ్రెడ్డికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎస్పీ సమర్పించిన నివేదిక ఆధారంగా కొండ్రెడ్డిపై చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ ఆ నోటీసులో పేర్కొన్నారు. కొండ్రెడ్డిని తరచూ గొడవలకు దిగే నేరస్థుడిగా గుర్తించినట్టు పేర్కొన్న కలెక్టర్.. ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం-1980 ప్రకారం సెక్షన్ 2(1) కింద అతనిని గూండాగా పరిగణించవచ్చని పేర్కొన్నారు.

తాజా కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కొండ్రెడ్డి బెయిలుపై కడప జైలు నుంచి బయటకు రాగానే కలెక్టర్ జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి అందిన తేదీ నుంచి ఆరు నెలలపాటు జిల్లా వదిలి వెళ్లాలని ఆదేశించారు. అలాగే ట్రైబ్యునల్‌లో అప్పీలు చేసుకునేందుకు 15 రోజుల సమయం ఇచ్చారు. దీంతో జైలు నుంచి బయటకు రాగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News