కుక్కను చంపబోయి.. తన ప్రాణాలు తీసుకున్న మహిళ
- ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగిన విషాదకర ఘటన
- ఇంటి ఇల్లాలు, ఆమె కుమారుడ్ని కరిచిన పెంపుడు కుక్క
- కోపంతో కుక్కను చంపేసిన ఇంటి ఇల్లాలు
సదరు మహిళ పేరు రూబి. ఈ విషయం ఏమీ తెలియని ఆమె భర్త తన భార్య కనిపించకపోయే సరికి ఆమె కోసం ఊరంతా వెతకడం మొదలు పెట్టాడు. చివరికి సరస్సు పక్కన ఆమె చెప్పులు కనిపించడంతో స్థానికుల సాయంతో అన్వేషించి ఆమె మృతదేహాన్ని బయటకు తీశాడు. అనంతరం దీనిపై పోలీసులకు సమాచారం అందింది. మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం పంపించినట్టు అడిషనల్ డీసీపీ అలీ అబ్బాస్ తెలిపారు. పోస్ట్ మార్టమ్ నివేదికలోని అంశాల ఆధారంగా కేసులో తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.