Vande Bharat Train: సికింద్రాబాద్-విజయవాడ వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

PM Modi inaugurates Vande Bharat train between Secunderabad and Vijayawada
  • ఈ నెల 19న తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభం
  • సికింద్రాబాద్ లో కార్యక్రమం
  • పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

దేశంలో వందేభారత్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. త్వరలోనే తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. సికింద్రాబాద్-విజయవాడ వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగే ఓ కార్యక్రమంలో ప్రధాని పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. 

వందేభారత్... దేశంలోనే అత్యంత వేగంగా వెళ్లే సెమీ హైస్పీడ్ రైలు. గతేడాది భారత రైల్వే 7 వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టింది. 

ప్రస్తుతం న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కత్రా, గాంధీనగర్- ముంబయి సెంట్రల్, న్యూఢిల్లీ-అంబ్ అందౌరా, చెన్నై-మైసూరు, బిలాస్ పూర్-నాగపూర్, హౌరా-న్యూ జల్పాయ్ గురి స్టేషన్ల మధ్య వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వందేభారత్ రైలు ట్రయల్ రన్ లో గంటకు 180 కిమీ వేగం అందుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News