Fire Boltt Ninja Pro Plus: రూ.1,999కే ఫైర్ బోల్ట్ నుంచి స్మార్ట్ వాచ్

Fire Boltt Ninja Pro Plus is companys latest smartwatch to offer Bluetooth calling at just Rs 1799
  • బ్లూటూత్ కాలింగ్ ఫీచర్
  • వాయిస్ అసిస్టెన్స్ సదుపాయం
  • హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఎన్నో..
బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో స్మార్ట్ వాచ్, అది కూడా ఒక ప్రముఖ కంపెనీ నుంచి వస్తుంటే మంచి ఆఫర్ కాదని ఎలా అనగలం? ఫైర్ బోల్ట్ నింజా కాలింగ్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్ ధర కేవలం రూ.1,999. బ్లాక్, బ్లూ, గ్రీన్, గోల్డ్ బ్లాక్, పింక్, సిల్వర్, డార్క్ గ్రే రంగుల్లో ఇది లభిస్తుంది. 

1.83 అంగుళాల డిస్ ప్లే, 120 స్పోర్డ్స్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. ఐపీ 67 సర్టిఫైడ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉంది. వాయిస్ సాయంతో కావాల్సిన దాని గురించి సెర్చ్ చేసుకోవచ్చు. పల్స్ ఆక్సీమీటర్ మాదిరే ఎస్పీవో2 ఎంతున్నది చూసుకోవచ్చు. అలాగే హార్ట్ రేట్ ను కూడా ట్రాక్ చేస్తుంది. నిద్రించే తీరును సైతం ట్రాక్ చేస్తుంది. స్మార్ట్ వాచ్ నుంచే కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక విధంగా ఫోన్ ను బయటకు తీయకుండానే స్మార్ట్ వాచ్ నుంచే అన్ని పనులు చేసుకోవచ్చు. అమెజాన్ పోర్టల్ పై ఇది విక్రయానికి ఉంది.
Fire Boltt Ninja Pro Plus
smartwatch
Bluetooth calling

More Telugu News