Balakrishna: అత్యవసరంగా ల్యాండ్ అయిన బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్

Technical issue in Balakrishna travelling helicopter
  • ఒంగోలు నుంచి హైదరాబాద్ కు హెలికాప్టర్ లో బయల్దేరిన బాలయ్య
  • 15 నిమిషాల తర్వాత తలెత్తిన సాంకేతిక లోపం
  • ఒంగోలులో అత్యవసరంగా ల్యాండ్ చేసిన పైలట్

సినీ నటుడు బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. నిన్న సాయంత్రం ఒంగోలులో బాలయ్య సినిమా 'వీర సింహారెడ్డి' ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. కార్యక్రమం అనంతరం బాలయ్య నిన్న రాత్రి ఒంగోలులోనే బస చేశారు. ఈ ఉదయం ఒంగోలు నుంచి హైదరాబాద్ కు ఆయన హెలికాప్టర్ లో బయల్దేరారు. ఆయనతో పాటు సినీ నటి శృతిహాసన్, సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ తదితరలు ఉన్నారు.

ఒంగోలు నుంచి బయల్దేరిన 15 నిమిషాలకు హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హెలికాప్టర్ ను వెనక్కి మళ్లించిన పైలట్ ఒంగోలులోని హెలిపాడ్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం సాంకేతిక సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు నిన్న హైదరాబాద్ నుంచి ఒంగోలుకు బాలయ్య ఇదే హెలికాప్టర్ లో వెళ్లారు. బాలయ్యకు ప్రమాదం తప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

టాలీవుడ్లో మాస్ యాక్షన్ సినిమాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన 'వీరసింహా రెడ్డి' ఈ నెల 12వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఆ రెండు పాత్రలను నిన్న విడుదల చేసిన ట్రైలర్ లో రివీల్ చేశారు. ఈ సినిమా కథ .. బాలయ్య పాత్రకి తగినట్టుగానే పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. 'నాది ఫ్యాక్షన్ కాదు .. సీమ మీద ఎఫెక్షన్' .. 'పదవి చూసుకుని నీకు పొగరెక్కువేమో .. బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువ' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News